Header Banner

14 ఏళ్లకే పెళ్లి.. 15 ఏళ్లకే 4 పిల్లల తల్లి.. 10 ఏళ్లు ఇండస్ట్రీని ఊపింది.. చివరికి, పరాయి దేశంలో చావు!

  Mon Jun 09, 2025 21:59        Entertainment

భారతీయ సినిమా గోల్డెన్‌ ఎరా నడుస్తున్న సమయంలో ఆమె తన నటనతో అందరినీ మెస్మరైజ్‌ చేసింది. ఎడ్యుకేషన్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్న కుటుంబం నుంచి వచ్చి, పర్సనల్‌ లైఫ్‌లో ఎన్నో ఛాలెంజెస్‌ను ఎదుర్కొంది. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసింది. రాజ్ కపూర్, అశోక్ కుమార్ వంటి దిగ్గజాలతో నటించి అనేక హిట్ సినిమాలు అందించింది. ఆమె జీవితం, కెరీర్, సాధించిన విజయాలు అభిమానులను ఇప్పటికీ ఇన్‌స్పైర్‌ చేస్తాయి. కష్టాల మధ్య కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన ఆమె కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆమె ఎవరో కాదు, లీలా చిట్నిస్‌. 1909 సెప్టెంబర్ 9న మహారాష్ట్రలోని ధార్వాడ్‌లో జన్మించిన లీలా చిట్నిస్ (Leela Chitnis), ఇంగ్లీష్ ప్రొఫెసర్ కుమార్తె. మరాఠీ కుటుంబంలో పెరిగిన ఆమె, మహారాష్ట్రలో మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్‌గా గుర్తింపు పొందింది. బాంబే యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ సాధించింది. నాటక రంగంలోకి అడుగుపెట్టి.. నాట్యమన్వంతర్ థియేటర్ గ్రూప్‌ ద్వారా అనేక నాటకాల్లో నటించింది. 1930ల్లో ఆమె తన అందమైన లుక్స్‌తో సోప్స్‌ బ్రాండ్స్‌కు మోడల్‌గా కూడా పనిచేసింది. ఈ టైమ్‌లోనే ఆమె సినిమా రంగంవైపు అడుగులు వేసింది. చిన్న వయసులోనే ప్రముఖ వైద్యుడు డాక్టర్ గజానన్ యశ్వంత్ చిట్నిస్‌ను (Leela Chitnis) పెళ్లి చేసుకున్న లీలా.. 15-16 ఏళ్ల వయసులోనే నలుగురు అబ్బాయిలకు తల్లి అయింది.

 

ఇది కూడా చదవండి: A4 సిగ్నేచర్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టిన ఆడి ఇండియా.. లుక్, ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే!

 

అయితే, విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ఒంటరిగా పిల్లలను పోషించే బాధ్యత స్వీకరించింది. ఆర్థిక ఇబ్బందుల నడుమ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది. 1937లో ‘జెంటిల్‌మన్ డాకూ’ సినిమాలో పురుషుడిగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆమె నటనా నైపుణ్యం బాంబే టాకీస్ వంటి ప్రముఖ స్టూడియోలను ఆకర్షించింది. లీలా చిట్నిస్, అశోక్ కుమార్ జోడీ 1940లలో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ‘కంగన్’ (1939), ‘బంధన్’ (1940), ‘ఝూలా’ (1941), ‘ఆజాద్’ (1940) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌ సాధించాయి. ఈ సినిమాలు ఆమెకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి. ఆమె నేచురల్‌ యాక్టింగ్‌, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. 1948లో ‘షహీద్’లో దిలీప్ కుమార్ తల్లిగా, 1951లో ‘ఆవారా’లో రాజ్ కపూర్ తల్లిగా నటించి ఆమె తల్లి పాత్రలకు పెట్టింది పేరుగా మారింది. విడాకుల తర్వాత లీలా (Leela Chitnis) తన నలుగురు కొడుకులను పోషించడానికి సినిమాలపై ఆధారపడింది. 1940లలో ఆమె లక్స్ సోప్‌ యాడ్స్‌లో కనిపించడం, సమాజంలో మహిళలకు కొత్త గౌరవాన్ని తెచ్చిపెట్టింది. కెరీర్‌లో మొత్తం 40కి పైగా సినిమాలు చేసింది. వీటిలో ‘మేరా మున్నా’ (1967), ‘గంగా జమునా’ (1961) వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. 1960ల తర్వాత లీలా సినిమా రంగం నుంచి క్రమంగా దూరమైంది. తన కుటుంబం కోసం 1970లలో అమెరికా వెళ్లి స్థిరపడింది. కనెక్టికట్‌లోని డాన్‌బరీలో నర్సింగ్ హోమ్‌లో 2003 జులై 1494 ఏళ్ల వయసులో కన్నుమూసింది. ఆమె మరణానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. వృద్ధాప్యం వల్ల సహజంగా జరిగినట్లు రిజిస్టర్‌ చేశారు. ఆమె తన చివరి రోజుల్లో కుటుంబానికి దగ్గరగా గడిపింది.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TragicLife #Actress #ForeignLand #Tollywood #Actress #ViralNews